• Login / Register
  • KCR is BACK | సీఎంగా మళ్లీ కేసీఆర్‌ రావాలి

    KCR is BACK  | సీఎంగా మళ్లీ కేసీఆర్‌ రావాలి
    బీఆర్ఎస్ అధినేత ఫ్లెక్సీకి రైతులు, కూలీల క్షీరాభిషేకం

    HYDERABAD |  రాష్ట్రంలో  కాంగ్రెస్‌ ప్రభుత్వ 10 నెలల పాలనలోనే అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు, రైతులు సీఎంగా మళ్లీ కేసీఆర్‌ రావాలని కోరుకుంటున్నారు. రుణమాఫీ కాక పోవ‌డం , రైతుబంధు రాక పోవ‌డంతో తాము ఇబ్బందులు పడుతున్నామని, తమకు సీఎంగా మళ్లీ కేసీఆర్‌ రావాలని కోరుతూ శనివారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మామిడాల పరిధిలోని హేమ్లాతండాకు చెందిన రైతులు, కూలీలు తమ పొలాల్లోనే మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. నాడు కేసీఆర్‌ పాలనే బాగుందని, రైతాంగానికి సాగుకు 24 గంటల కరెంట్‌, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, రైతుబంధు ద్వారా ప్రతి కారుకు పంట పెట్టుబడి ఇచ్చి తమను ఆదుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఎన్నికల సమయంలో ఏదో చేస్తామని హామీలిచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు రైతులను అష్టకష్టాల పాలు చేస్తున్నారని మండిప‌డ్డారు.
    * * *

    Leave A Comment